వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబోలో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో థర్డ్ సింగిల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, ప్రోమో థర్డ్ సింగిల్ కోసం చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెస్టివ్ బ్యాంగర్ థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పొంగల్ స్ఫూర్తిని క్యాప్చర్ చేసింది. వెంకటేష్, మైపిలో రోహిణి సోరట్, భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. భీమ్స్ DJ అవతార్ ఆలాపనతో పాట ప్రారంభమైయింది, జనవరి చలి వాతావరణం, రంగోలీల వంటి సంక్రాంతికి ముందు జరిగే ఉత్సవాలతో సీన్ ని అద్భుతంగా సెట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎనర్జీ అదిరిపోయింది.
Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!
ఈ పాట రూరల్ పొంగల్ వేడుకలను అందంగా ప్రజెంట్ చేసింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం పండగ ప్రాముఖ్యతను, ఐక్యత, వేడుకలను అద్భుతంగా వర్ణించింది. వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ట్రాక్‌కి ఎనర్జిటిక్ టచ్‌ని యాడ్ చేసింది, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, మయిపిలో రోహిణి సోరట్‌లు తమ డైనమిక్ వోకల్స్ ఆకట్టుకున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతమైన పండుగ మూడ్‌కు పెర్ఫెక్ట్ గా వుంది, వెంకటేష్, ఇద్దరు హీరోయిన్స్ సాంప్రదాయ వస్త్రధారణలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. గ్రామీణ సంస్కృతిని వర్ణించే గ్రాండ్ సెట్, సాంగ్ కి కలర్ ఫుల్ వైబ్‌ని యాడ్ చేసింది, పొంగల్ ఉత్సవాల్లో ఆడియన్స్ ని ముంచెత్తుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.