CM Relief Fund: సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ.. డిప్యూటీ సీఎంకు చెక్ అందజేసిన హైపర్ ఆది
- వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న దాతలు..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విరాళాలు అందజేసిన పలువురు..
- రూ.67.29 లక్షల చెక్కును అందజేసిన అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్..
- రూ. 3 లక్షల చెక్కును అందజేసిన హైపర్ ఆది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Relief Fund: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు.. వరదలు అతలాకుతలం చేశాయి.. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెక్కులు అందించారు పలువురు దాతలు.. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్ తరఫున రూ.67,29,398 చెక్కును పవన్ కల్యాణ్‌కి అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యువ షణ్ముఖ, అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ ఫరూక్ జాన్, ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు దొర తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణమ్ మార్కండేయ బాబు పాల్గొన్నారు. మరోవైపు.. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గం నుంచి అందిన రూ.4.82 లక్షల విరాళం సహాయ నిధికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పవన్ కల్యాణ్ కి అందచేశారు.
Read Also: Govinda Namalu: మనసులోని కోరికలు తీరాలంటే గోవిందనామాలు వినండి
Also Read
- Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
- Naga Vamsi: 'పెద్ది' కోసమే సైలెంట్ అయ్యా.. లేదంటే కావాలనే చేశాననేవారు.. అసలు విషయం చెప్పేసిన నాగవంశీ!
- AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
- Babu Mohan: 15 సినిమాల్లో నటిస్తున్నా.. డ్యాన్స్‌లు కూడా చేశా.. బాబు మోహన్ ఆసక్తికర విషయాలు!
మరోవైపు టాలీవుడ్ యువ నటుడు ఆది అలియాస్ హైపర్ ఆది తన వంతు సాయాన్ని అందించారు.. గ్రామ పంచాయతీలకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అందించారు. వరదల పీడిత గ్రామమైన ఎ.కె.మల్లవరం (పిఠాపురం నియోజకవర్గం) పంచాయతీకి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆది.. మరో రూ.2 లక్షలు తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీ (ప్రకాశం జిల్లా)కి ఇచ్చారు. ఆ రెండు వేర్వేరు చెక్కులను పవన్ కల్యాణ్‌కి అందజేశారు.. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రూ.6 కోట్లు విరాళం ఇచ్చి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారు. నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి నా వంతుగా రూ.3 లక్షలు అందించాను అని వెల్లడించారు హైపర్ ఆది..
తాజావార్తలు
-
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
-
Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
-
Kriti Sanon: అమ్మతనం కోసం కృతి సనన్ సంచలన నిర్ణయం.. ఆ సినిమా టైమ్‌లోనే అలా!
-
Antarctica: రక్త జలపాత రహస్యం.. 100ఏళ్ల మిస్టరీ వీడింది!
-
IND vs ENG 3rd T20: ‘సర్పంచ్ సాబ్’ సత్తాకు పరీక్ష.. ఆ స్టార్స్ రాణించకుంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!