Chhava: చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ ‘చావా’. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు.. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ని సవాల్ చేసే రేంజ్‌లో ఈ మూవీ నెంబర్లు నమోదవుతున్నాయి. బుక్కింగ్స్ చూసుకుంటే మొదటి వీకెండ్‌కే సులభంగా వంద కోట్లు దాటడం ఖాయం అని టాక్.
లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గాను , రష్మిక మందన్న యేసు బాయ్ గా కూడా నటించగా.. వీరి నటన చూసి థియేటర్ లో అభిమానులు ఒకవైపు నినాదాలు చేస్తు, మరొవైపు ఎమోషన్‌కు గురై కన్నీళ్లను కూడా పెట్టుకుంటున్నారు. అలా వారి పాత్రకు వంద శాతం న్యాయం చేశారు విక్కీ&రష్మిక. అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే ఈ మూవీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్ హీరో వద్దకు వచ్చిందట..
Also Read
Also Read:Pavani Reddy: రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్..
అవును ముందుగా దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ఈ సినిమా కోసం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించారంట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదంట. దీంతో ఈ కథను చాలా రోజులు పెండింగ్ లో పెట్టాడట. ఇక హీరోయిన్‌గా కత్రీనా కైఫ్‌ను అనుకున్నారంట. ఆమె కూడా దీనికినో చెప్పిందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ బాబు కనుక ఈ మూవీని ఒప్పుకొని ఉంటే పాన్ ఇండియా స్టార్‌గా ఒక రెంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకునేవాడు. ఏది ఏమైనప్పటికి విక్కీ మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. తన యాక్టింగ్‌కి ప్రేక్షకులు వందకు వంద మార్కులు ఇచ్చారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!