సీరియల్స్ లో నటించి, అనంతరం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌లు గా చలమని అవుతున్న వారిలో పావరి రెడ్డి ఒకరు. ముందుగా తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది టాలీవుడ్, కోలీవుడ్ లో డబుల్ ట్రబుల్, డ్రీమ్,గౌరవం, ప్రేమకు రెయిన్క్, మళ్లీ మొదలైంది.. చారి 111, వంటి చిత్రాల్లో మెరిసింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే. తాజాగా ఈ అమ్మడు ‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్న.. ఒకరికొకరం తోడుంటాం అని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాం. ఇకపై కలిసి జీవిద్దాం’ అంటూ ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది పావని రెడ్డి. ఈనెల 20న ప్రముఖ కొరియోగ్రాఫర్ అమిర్ తో ఏడడుగులు నడపనున్నట్లు ఈ పోస్ట్ లో తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పావని, అమిర్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇది పావనికి రెండో పెళ్లి..
అవును 2013లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పావని. కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపగా, పావని రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. ఆమె మరొకరితో చనువుగా ఉండటం వల్ల, ప్రదీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వార్తలు వైరల్ అయ్యాయి. దీని గురించి ఎప్పుడు ఎక్కడ కూడా పావని ప్రస్తావించలేదు. కానీ కోల్పోయిన చోటనే జీవితం ఆగిపోకూడదు కదా.. అందుకే ఆమె ఎలాంటి రూమర్స్ వచ్చిన కొట్టి పడేసి కొత్త జీవితం ప్రారంభించబోతుంది.