దసరా కానుకగా రిలీజ్ అయిన సినిమాల సందడి దాదాపు ముగిసింది. సోమవారం కాసిని టికెట్లు తెగాయి. రానున్న వర్కింగ్ డేస్ లో ఈ మాత్రం కూడా ఉండక పోవచ్చు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రానున్న దీపావళి పైనే. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు అరడజను సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. కొన్ని సినిమాలు దివాళి రేస్ లోకి వచ్చి చేరగా మరికొన్నీ తప్పుకున్నాయి.
Also Read : Rajnikanth: G.O.A.T ను నాలుగు రోజుల్లో లేపేసిన వేట్టయాన్.
అందరి కంటే ముందుగా వంకాయ బాంబు లాంటి దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అనుకున్న డేట్ కంటే ఒక్కరోజు ముందుగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి సౌండ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక అక్టోబరు 31న సీమ టపాకాయ్ ని పోలిన నిఖిల్ నటిస్తున్న అప్పుడో ఇపుడో ఎపుడో రెడీ గా ఉంది, అలాగే తారాజువ్వ లాంటి సత్యదేవ్ జీబ్రా కేసుల అదే రోజు వస్తొంది. ఇవి చాలవన్నట్టు చిచ్చుబుడ్డి వంటి తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ‘అమరన్’ కూడా రేస్ లో నిలిచింది. తానేమి తక్కువ కాదని భూచక్రం అయిన జయం రవి లీడ్ లో తెరకెక్కిన బ్రదర్ వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో సూపర్ హిట్ టాక్ తో దీపావళికి సౌండ్ చేసేది ఏ సినేమానో అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజుల వరకు ఆగాలి.