టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి కెరీర్‌కి మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అప్పట్లో అగ్ర హీరోలంతా కోరుకునేవారు. కానీ ప్రజెంట్ అతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా డిజాస్టర్ అందుకున్న పూరీ నెక్స్ట్ మూవీ ఏంటి.. ఏ హీరోతో చేస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం పూరి తదుపరి చిత్రం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
అవును రీసెంట్‌గా పూరి టాలీవుడ్ ట్యాలెంటేడ్ హీరో గోపీచంద్ కోసం ఓ కథ పై చర్చలు జరిపినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి పూరి కేవలం స్టోరీ, డైలాగ్స్ మాత్రమే అందిస్తాడని, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పాత స్టైల్‌ను ఫాలో అవుతాడని టాక్. ఇక వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ మూవీ అంత చూసే ఉంటారు. ఇప్పుడు తిరిగి 15 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పోతే గోపీచంద్ కి గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. సీటీమార్ , రామబాణం వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు గోపీచంద్. ఇందులో భాగంగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ చుట్టూరి నిర్మాణంలో మరో సినిమా సెట్ అయిందనే టాక్ ఉంది. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.