Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘సలార్’ వంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ – బుచ్చిబాబుల ‘పెద్ది’ కూడా రెండు భాగాలుగా రానుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై వస్తున్న వార్తలకు దర్శకుడు బుచ్చిబాబు సన అఫీషియల్‌గా చెక్ పెట్టారు.
ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ‘పెద్ది పార్ట్ 2’ పై వస్తున్న రూమర్స్ గురించి బుచ్చిబాబు స్పష్టంగా, ముక్కుసూటిగా సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘పెద్ది కథ ఒక సారే వస్తుంది. అది కూడా కేవలం ఒక పార్ట్ (Single Volume) మాత్రమే. ఒకే కథను లాగి.. రెండు పార్ట్ ల్లో తీయడం అనేది నాకు అస్సలు నచ్చదు. ఒక కథను అనుకున్నప్పుడు దాన్ని ఒకే సినిమాలో పూర్తిగా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత మరో కొత్త కథపై దృష్టి పెట్టడం నా మేకింగ్ స్టైల్. అంతే కానీ, ‘పెద్ది’ సినిమా కథకు పార్ట్ 2 అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సెట్ కాదు’ అని అన్నారు. డైరెక్టర్ ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్మెంట్తో ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి సీక్వెల్స్ లేదా పార్ట్ 2లు ఉండవని, కథ మొత్తం ఒకే భాగంలో ఎండ్-టు-ఎండ్ కంప్లీట్ అయిపోతుందని స్పష్టమైపోయింది. ఒక ప్రాపర్ కంటెంట్ ఉన్న సినిమాగా పార్ట్ 1 లోనే ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి హై-వోల్టేజ్ ఎమోషన్‌ను అందించబోతున్నట్లు బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?