సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారని, గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్‌లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా జయకృష్ణ లండన్‌లో నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే తాజాగా జయకృష్ణను తెలుగు చిత్రసీమలో ఆవిష్కరించేందుకు దర్శకుడు సిద్ధం అయ్యాడు.
Also Read : Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46
‘RX 100’, ‘మంగళవారం’ లాంటి చిత్రాలతో బోల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వం జయకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించనున్నాయి. అంటే ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి మాత్రం ప్రస్తుతం ‘మంగళవారం 2’తో బిజీగా ఉన్నప్పటికీ, జయకృష్ణ డెబ్యూ సినిమాను కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. కాగా ఈ సినిమా కథ యాక్షన్, ఎమోషన్ తో యువతను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూస్తూ, కొన్ని నిర్మాణ అంశాల్లో కీలక సలహాలు ఇస్తున్నాడని సమాచారం.