లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు బుధవారం హిందుజా హాస్పిటల్ లో డాక్టర్ జలీల్ పార్కర్ తో పాటు డాక్టర్ నితిన్ గోఖలే తగిన చికిత్స చేశారు. శ్వాససంబంధమైన అనారోగ్యంతో ఆదివారం హాస్పిటల్ లో చేరిన దిలీప్ కుమార్ ను వెంటిలేటర్ సహాయం లేకుండానే వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే… బుధవారం ఐసీయూలో చేర్చి, ఊపిరితిత్తుల బయట అదనంగా ఉన్న ఫ్యూయిడ్స్ కారణంగా పడుతున్న ఇబ్బందిని గమనించి తగిన చికిత్స చేశామని అన్నారు. దిలీప్ కుమార్ వైద్యానికి చక్కగా సహకరించారని, అనంతరం ఆయన్ని వార్డులోకి తరలించామని తెలిపారు. ఈ చికిత్స అనంతరం ఆయన ఆక్సిజన్ లెవల్స్ 100 ఉన్నాయని, ఆరోగ్యం ఇలానే నిలకడగా ఉంటే…. గురువారం డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ జలీల్ పార్కర్ చెప్పారు.