తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు.
Also Read:Rana : ఈడీ విచారణకు హీరో రానా
మొదట నానితో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఆయన చేయలేనని చెప్పడంతో నితిన్ హీరోగా ఎంపికయ్యారు. కానీ, నితిన్ వరుస ఫ్లాపులతో మార్కెట్ విలువ తగ్గడంతో బడ్జెట్‌పై ఆందోళన నెలకొన్నా వేణు యెల్దండి కథను నమ్మిన దిల్ రాజు, ఈ గ్రామీణ ప్రేమకథను ఆకర్షణీయంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఈ సినిమా నిలిచిపోయింది అనే వార్తలు అవాస్తవమే, త్వరలోనే పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది.. తెలంగాణ నేపథ్యంలో, ఎల్లమ్మ దేవత చుట్టూ తిరిగే ఈ కథ, ‘బలగం’ లాంటి హృదయస్పర్శి భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సినిమాల కోసం దిల్ రాజు ప్రయత్నిస్తున్నప్పటికీ, వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రాజెక్టులు ఆలస్యం కానున్నాయి. ‘ఎల్లమ్మ’తో దిల్ రాజు మళ్లీ సక్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకుంటారని భావిస్తున్నారు.
