తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అయన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు. భాద్యతలు స్వీకరించిన అనంతరం దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ TFDC చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు.
Also Read : Star Boy : ప్రభాస్ సినిమాను ఢీ కొట్టనున్న సిద్దు జొన్నలగడ్డ
తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావాలి, అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తాను. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఏంతో అభివృద్ధి చెందింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. TFDC చైర్మన్ గా నాపై చాలా భాద్యత ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తా సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్య లతో పాటు డిస్టబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’ అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ముఖ్యులు దిల్ రాజు కు శుభాకాంక్షలు తెలిపారు.