ఈ ఏడాది దిల్ రాజు భారీ అపజయం ఒకటి మూటగట్టుకున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో ఒక హిట్టు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన నిర్మాతగా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి నితిన్ కి సరైన హిట్టు సినిమా పడి చాలా కాలం అయింది. వరుసగా నాలుగు డిజాస్టర్లు తర్వాత ఇప్పుడు తమ్ముడు అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని గతంలో వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ చేసిన వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..?
ఈ సినిమా మీద కూడా దిల్ రాజు గట్టిగానే ఖర్చుపెట్టాడు ప్రస్తుతం నితిన్ మార్కెట్తో పోలిస్తే ఆ అమౌంట్ చాలా ఎక్కువ. ఈ సినిమా కోసం మూడేళ్ల క్రితం పని మొదలైంది. మొత్తం మీద 75 కోట్లు ఖర్చు పెట్టాడట దిల్ రాజు. అనేక కారణాలతో షూట్ ఆలస్యం అవుతూ వచ్చింది. మేకింగ్ కోసమే 150 రోజులకు గాను 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్, ఇతర ఖర్చులు చూసుకుంటే మొత్తం మీద 75 కోట్లు దాకా అయినట్లు తెలుస్తోంది.
Also Read:Tollywood: త్వరలో టాలీవుడ్ కీలక సమావేశం
ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఒక రకంగా ఇది దిల్ రాజుకి పెద్ద పెను సవాల్ లాంటి పరిస్థితి అని చెప్పాలి. నితిన్ మార్కెట్ ను బట్టి టీం టెన్షన్ లో ఉంటే దిల్ రాజు మాత్రం సినిమా అదిరిపోయింది అని ఏమాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు. ఇప్పటికే ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తో ఈ సినిమా విషయంలో తగ్గేది లేదని అంటున్నారు. మరి ఈ పెను సవాల్ నుంచి ఆయన ఎలా బయటపడతాడు అనేది చూడాలి.