Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనే విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ ఈ అంశం ఎక్కడ మొదలైంది అంటే ఏప్రిల్ 19వ తేదీన ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్ లో ఎగ్జిబిటర్లు వాళ్లకున్న సమస్యలు చెప్పుకొని రెంటల్ విధానాల్లో సినిమాలు ఆడిస్తే మాకు వర్కౌట్ కావడం లేదు కాబట్టి మాకు పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి సినిమా సంవత్సరంలో 150 సినిమాలు రిలీజ్ అయితే 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానాల్లో ఆడుతున్నారు.
Also Read:Prabhas : కన్నప్పలో ప్రభాస్ ఎంతసేపు కనిపిస్తాడో చెప్పిన విష్ణు..
Also Read
- Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
- Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
- Ravi Teja -Vivek : రవితేజ - వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
- Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
అక్కడే ఎగ్జిబిటర్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకుని వారు ఈ విధానం తీసుకురావాలని కోరడం జరిగింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. అదే విషయం మా హైదరాబాదులో ఉన్న నిర్మాతల దృష్టికి వచ్చింది. ఏప్రిల్ 26వ తేదీన నిర్మాతల గిల్డ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సమయానికి ఒకవేళ జూన్ 1వ తేదీకి వారు కోరుకున్న విధంగా పర్సంటేజీ విధానంలో సినిమాలు ఆడించకపోతే సినిమా ధియేటర్లో ఆపాలమే నిర్ణయం తీసుకున్నట్లు మా దృష్టికి తీసుకువచ్చారు. ఇది ఎగ్జిబిటర్లు -డిస్ట్రిబ్యూటర్లు మధ్య ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన..
Also Read: Dil Raju: వివాదం అంతా సద్దుమణిగింది.. మంత్రి దుర్గేష్ కి థాంక్స్.. దిల్ రాజు కీలక ప్రకటన
అది మా గిల్డ్ దృష్టికి వచ్చినప్పుడు గిల్డ్ లో ఉన్న నిర్మాతలు అందరూ అసలు వాళ్ళకి ఎందుకు వర్కౌట్ కావడం లేదు అని ఆలోచించి, ఒక ఆరు నెలలు వారికి అవుతున్న ఖర్చు ఏమిటి వారికి వస్తున్న ఆదాయం ఏమిటి అనే విషయాలు బేరీజు వేసి వారికి ఎందుకు వర్కౌట్ అవడం లేదు అనేది పరిశీలించడం కోసం వారిని స్టేట్మెంట్స్ తీసుకురావాలి అని అడుగుదామనుకున్నాం. వచ్చినప్పుడు డిస్కషన్ లో పెట్టి నిజంగా ఎగ్జిబిటర్లకు సమస్య ఉందా లేదా అనేది పరిశీలించాలి అనుకున్నాం. నిజానికి నేను డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు అన్ని ఏరియాలో కవర్ చేస్తున్నాను. ఎగ్జిబిటర్ల కష్టాలు కూడా మాకు తెలుసు. మేము నిర్మాతలుగా లేదా డిస్ట్రిబ్యూటర్లుగా బాగా డబ్బులు వస్తుంటే మొదటి వారం రెంట్ ఇస్తున్నాం రెండోవారం పర్సంటేజీ విధానం ఇస్తున్నాం. ఇది వాళ్లకు నిజంగా ఇబ్బందికరమైన విషయమే. దానికి సొల్యూషన్ మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఉన్న పరిస్థితుల కారణంగా నిర్మాతలు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఆ సొల్యూషన్ రావడం లేదు. అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!