దిల్ రాజు బాలీవుడ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రంపై ఇప్పటికే హిందీ బెల్ట్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తొలుత ఇది వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఇది ఒక కొత్త కథతో రూపొందుతున్న చిత్రమని స్పష్టమైంది.
ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏడాది చివరలో క్రిస్మస్ సీజన్‌కు ముందే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాలని దిల్ రాజు టీమ్ ప్లాన్ చేస్తోంది.ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు టాలెంటెడ్ నటి విద్యా బాలన్, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తోంది. ‘భూల్ భూలయ్యా’ సిరీస్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో, ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన టైటిల్, మరిన్ని టెక్నికల్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
