Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 vs Ramayana Second Friday Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్ మూవీస్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’, ‘రామాయణ: పార్ట్-1’ సినిమాలు వసూళ్ల విషయంలో రికార్డులు బద్దలవుతున్నాయి. రెండో శుక్రవారం హిందీ నెట్ కలెక్షన్లలో ఈ రెండు చిత్రాల మధ్య హోరాహోరీ పోటీ కనిపించింది. గణాంకాల ప్రకారం.. ధురంధర్ 2 రూ.37 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రామాయణ రూ.36.25 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. కేవలం రూ.75 లక్షల తేడాతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ సాగడం విశేషం.
రెండో శుక్రవారం టాప్-10 సినిమాలు ఇవే:
రెండో శుక్రవారం అత్యధిక హిందీ నెట్ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ధురంధర్ 2 మొదటి స్థానంలో నిలిచింది. రామాయణ: పార్ట్-1 రెండో స్థానంలో ఉండగా.. మొదటి భాగమైన ధురంధర్ రూ.30 కోట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ రూ.24.75 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ‘ఛావా’ రూ.23 కోట్లతో ఐదో స్థానంలో, ‘యానిమల్’ రూ.22.27 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. ‘బాహుబలి 2’ రూ.19.81 కోట్లతో ఏడో స్థానంలో నిలవగా.. ‘గదర్ 2’ రూ.19.62 కోట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ రూ.18.80 కోట్లతో తొమ్మిదో స్థానంలో, ‘స్త్రీ 2’ రూ.18.27 కోట్లతో పదో స్థానంలో నిలిచాయి.
Also Read
- Chiranjeevi: 'మెగాస్టార్' ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
రామాయణ రికార్డు:
ప్రపంచవ్యాప్తంగా రోజుకు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన రోజుల సంఖ్యలోనూ (వరుస రోజుల్లో) రామాయణ: పార్ట్-1 సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 8 రోజుల పాటు రోజుకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ధురంధర్ 2, పుష్ప 2, బాహుబలి 2, జవాన్ సినిమాలు నాలుగు రోజుల పాటు ఈ ఘనత సాధించాయి. ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, యానిమల్, కేజీఎఫ్ 2 చిత్రాలు మూడు రోజుల పాటు రూ.100 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. ఇక పఠాన్ రెండు రోజుల పాటు ఈ మైలురాయిని అందుకుంది.
ఇండియన్ బాక్సాఫీస్‌పై భారీ బడ్జెట్ మూవీస్ ఆధిపత్యం:
గణాంకాలను పరిశీలిస్తే . భారతీయ సినిమా మార్కెట్లో భారీ బడ్జెట్ చిత్రాల ప్రభావం ఎంతగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ముఖ్యంగా ధురంధర్ 2, రామాయణ: పార్ట్-1 సినిమాలు కలెక్షన్ల పరంగా సరికొత్త బెంచ్ మార్క్‌లను సృష్టిస్తున్నాయి. హిందీ నెట్ వసూళ్లలో అగ్రస్థానం కోసం పోటీ పడుతూనే.. ప్రపంచవ్యాప్త వసూళ్లలోనూ రికార్డులు తిరగరాస్తుండటం విశేషం. రామాయణ జోరు చూస్తుంటే.. వచ్చే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!