Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మెగాస్టార్’ చిరంజీవి అభిమానులకు ఒకేసారి రెండు అదిరిపోయే శుభవార్తలు. ఒకవైపు ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోగా.. మరోవైపు సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కట్ పూర్తయినట్లు దర్శకుడు స్వయంగా వెల్లడించడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఒకవైపు మన శంకరవరప్రసాద్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం.. మరోవైపు విశ్వంభర ట్రైలర్ సిద్ధం కావడం మెగాస్టార్ అభిమానులకు డబుల్ ధమాకాగా మారింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు మరో అరుదైన మైలురాయిని అందుకుంది. గోవాలో జరగనున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పనోరమా విభాగానికి ఈ చిత్రం అధికారికంగా ఎంపికైంది. జాతీయ స్థాయి చలనచిత్ర వేడుకలో ఈ గుర్తింపు దక్కించుకోవడం చిత్ర బృందంతో పాటు మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా ఖాతాలో మరో ప్రత్యేక గుర్తింపు చేరినట్లయింది.
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
మరోవైపు చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ట్రైలర్ కట్ పూర్తిగా సిద్ధమైంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX)తో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. సాంకేతిక పనుల కారణంగా సినిమా విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ.. తాజాగా ట్రైలర్ సిద్ధం కావడం ఆసక్తిని పెంచుతోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేసిన వెంటనే ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ట్రైలర్ లాంచ్ ఎప్పుడు ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
-
BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
-
Usman Khawaja: ఉస్మాన్ ఖవాజా బెడ్‌పై మైఖేల్ బీర్ ఆ పని చేశాడా?.. వెలుగులోకి సంచలనం విషయం!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!