బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ సిరీస్ కు విరితమైన ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా ఈ సిరీస్ లోని హీరో కమ్ విలన్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ధూమ్ సిరీస్ లోని దోపిడీ సీన్స్ ఎంత ఫెమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ధూమ్ సిరీస్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఈ సిరీస్ లో వచ్చే సినిమాలలో హీరోలంటూ ఉండరు. విలన్ క్యారెక్టర్ కు హీరోయిజం జోడించి తెరకెక్కించడం ధూమ్ సిరీస్ స్పెషల్.
Also Read : ArshadWarsi : మరోసారి ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు..
ధూమ్ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, ధూమ్ 2 లో హృతిక్ రోషన్ , ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించారు. ఈ మూడింటిలో ధూమ్ 2 లో హృతిక్ చేసిన విన్యాసాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. ఇక ఈ సిరీస్ లో భాగంగా ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ వర్క్ స్టార్ట్ చేసింది. కాగా అందరిలోను ఒకటే డౌట్ ధూమ్ – 4లో విలన్ రోల్ లో కనిపించే హీరో కమ్ విలన్ ఎవరు అనేది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధూమ్ 4 లో చాక్లెట్ బాయ్ రన్ బీర్ కపూర్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి కథ చర్చలు ముగిసాయి, త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అనే చెప్పాలి.