Devara to Release in 50 Days: సరిగ్గా మరో యాభై రోజుల్లో బాక్సాఫీస్ పై ‘దేవర’ దండయాత్ర చేయబోతున్నాడు. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది దేవర పార్ట్ 1. ఇక్కడి నుంచి దేవర రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. దీంతో.. సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు టైగర్ ఫ్యాన్స్. మరోవైపు.. మేకర్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా.. బ్లడ్ మూన్ షాట్‌తో పండగ చేసుకున్నారు అభిమానులు. ఇక అనిరుధ్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. ప్రస్తుతం దేవర సెకండ్ సింగిల్‌తో రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో 33 మిలియన్స్ వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్.. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 50 మిలియన్స్ క్రాస్ చేసింది.
అయితే.. ఇంత రెస్పాన్స్ వస్తున్న సాంగ్‌కి ట్రోలింగ్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. ఇది శ్రీలంకన్ మ్యూజిషియన్ కంపోజ్ చేసిన సాంగ్‌ను పోలి ఉందని.. ట్రోలర్స్ రెండు వీడియోలను పోలుస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. కానీ.. మేకర్స్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా.. సాంగ్‌ను లూప్ మోడ్‌లో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వేసిన స్టెప్పులతో చేసిన రీల్స్, కవర్ సాంగ్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీంతో.. దేవర పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ఇక ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని చెబుతున్నాడు. మరి.. దేవర ఏం చేస్తాడో చూడాలి.