యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీలో అడుగుపెతున్న సినిమాలు, వెబ్ సిరిస్ లు ఇవే
దేవర థియేట్రికల్ రైట్స్ అవుట్ రేట్ కు భారీ ధరకు కొనుగోలు చేసాడు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార వారి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్చేస్తున్నారు. ముందుగా నైజాం ఏరియాలో చుస్తే సితార సినిమాలు పంపిణి చేసే దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ కానుంది. ఆంధ్ర ఏరియాల వారిగ చూస్తే ఉత్తరాంధ్ర పూర్వి పిక్చర్స్, ఈస్ట్ గోదావరి విజయలక్ష్మి సినిమాస్, నెల్లూరు అంజలి పిచ్చర్స్, వెస్ట్ గోదావరి ఆదిత్య ఫిల్మ్స్ ( LVR ), కృష్ణ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, గుంటూరు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ కానుంది. ఇక నందమూరి ఫ్యాన్స్ అడ్డాగా పిలవబడే సీడెడ్ లో చుస్తే చిత్తూరు వందన ఫిల్మ్స్, కడప SRR ఫిల్మ్స్, కర్నూల్ విక్టరీ ఫిల్మ్స్, అనంతపురం ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెల్లవారు జామున 1.08 గంటల ఆటతో షోస్ మొదలు కానున్నాయి