Devara Success Meet: ఎటూ తేల్చుకోలేకపోతున్న ‘దేవర’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంటకే దేవర జాతర మొదలైంది. దీంతో మూడు రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది దేవర పార్ట్ 1. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో, మరో వారం రోజులు థియేటర్లో దేవరదే హవా ఉండనుంది. మరోవైపు.. ఈ సినిమా సక్సెస్‌ను గట్టిగా సలెబ్రేట్ చేయడానికి రెడీ అవుతోంది చిత్ర యూనిట్. కానీ ఎప్పుడు? ఎక్కడ? అనేది తేలడం లేదు. వాస్తవానికైతే.. దేవర సినిమా తెలుగు ప్రమోషన్స్ చేయలేదు ఎన్టీఆర్.
Nayantara : 50సెకన్లకు రూ.5కోట్లు.. నయనతార బాగా కాస్ట్లీ గురు !
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
హైదరాబాద్ నోవాటెల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్ అభిమానులు పోటెత్తడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దీంతో.. టైగర్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ దేవర సక్సెస్ మీట్‌తో అయినా ఎన్టీఆర్ తమ ముందుకు వస్తాడనే నమ్మకంతో ఉన్నారు. మేకర్స్ కూడా అభిమానుల సమక్షంలో సక్సెస్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2 లేదా 3వ తేదీన దేవర సక్సెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారని.. లేదు ఏపీలో ప్లాన్ చేస్తున్నారని భిన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేవర యూనిట్ లొకేషన్ కోసం సెర్చింగ్‌లో ఉన్నారట. హైదరాబాద్‌లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని అనుకుంటున్నారట. కానీ గుంటూరు లేదా విజయవాడలో భారీ ఎత్తున ‘దేవర’ సక్సెస్ మీట్ జరగనుందనేది లేటెస్ట్ అప్డేట్. అయితే.. మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..