కీర్తి సురేష్ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది కీర్తి సురేష్. అయితే ‘మహానటి’ లో సావిత్రి గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కెరీర్ ఆరంభం నుండి ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ ఇప్పుడు మాట తప్పింది. సినీరంగంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించి ఈ రూల్స్‌ను బ్రేక్ చేసిందట.
Also Read;OG : ‘ఓజి’ టీజర్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !
రీసెంట్‌గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్’ అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కీర్తి. ఈ మూవీలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసి, రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆమె.. హిందీలో రెండవ ప్రాజెక్టుకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో దీన్ని తేరకెక్కించబోతున్నట్లు సమాచారం. కీర్తిని దృష్టిలో ఉంచుకుని ఈ కథను సిద్ధం చేశారట దర్శకుడు. ప్రస్తుతం ఈ విషయం పై ఆమెతో చర్చలు జరుపుతుందట చిత్రబృందం. ఇంతకి ఆ దర్శకుడు ఎవరు ఏంటా ప్రాజెక్ట్ అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.