బాలీవుడ్‌లో తమదైన నటతో స్టార్స్ గా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డని తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా ఈ అమ్మడు తిరిగి తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దీపిక రణ్ వీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read : Jailer 2 : రజినీకాంత్ రెమ్యూనరేషన్.. ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్
దీపిక మాట్లాడుతూ.. ‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్‌వీర్ తో మాట్లాడుతూ.. ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. బేబీ నీ శరీరంలోనే పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చింది.