గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ ఈ కథా నాయకలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శక, నిర్మాతలు ఇంటర్వ్యూలలో డాకు మహారాజ్ విశేషాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమాలోని మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు నిర్మాత నాగవంశీ. జనవరి 4న డల్లాస్ లో జరగనున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ 3వ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట నందమూరి అభిమానులకు చాలా స్పెషల్ గా ఉంటుందని, లిరిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ఈ పాట చాట్ బస్టర్ అవుతుందని దర్శకుడు బాబీ ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. ఈ సాంగ్ లో బాలయ్య సరసన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా అలరించనుంది. ఈ పాటతో షేక్.. షేక్.. షేక్ ఆడిస్తానంటూ తమన్ ఎక్స్ లో పోస్ట్ చేసాడు.