బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె నటిస్తున్న “సందీప్ ఔర్ పింకీ ఫరార్” అనే చిత్రం గతవారం ఓటిటిలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె లింగ వివక్షతను గురించి మాట్లాడారు. సాధారణంగా పరిణితి చోప్రాకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. కాబట్టి ఆమె ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం లేదని అంతా భావిస్తారు. కానీ పరిణితికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. “ఈ చిత్రం ప్రత్యేకంగా వ్రాయబడింది. ప్రజలు పితృస్వామ్య వ్యవస్థకు బాగా అలవాటు పడ్డారు. దాని గురించి ఎవరూ ఆలోచించరు. భారతదేశంలో మహిళలు ప్రతిరోజూ దీనిని ఎదుర్కొంటారు. నేను నా ఇంటిని పునరుద్ధరించినప్పుడు, కాంట్రాక్టర్లు నాతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే నేను ఒక మహిళను. ఇంట్లో ఉన్న ఇంకెవరైనా మాట్లాడగలరా ? అని వారు అడిగారు. లేదు నేను ఈ ఇల్లు కొన్నాను, నేను చెల్లింపులు చేశాను. ఇది నాది కాబట్టి నేను టైల్స్ ఎన్నుకుంటాను. నాతో మాట్లాడమని నేను వారికి చెప్పినప్పుడు వారు నిరాకరించారు. ఈ చిత్రానికి నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి” అని ఆమె చెప్పుకొచ్చారు.