సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లొబ్ త్రొటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ ను ప్రకటించారు రాజమౌళి. ఇప్పుడు వారణాసి టైటిల్ రాజమౌళిని చిక్కుల్లో పడేసింది.
Also Read : Krithi Shetty : కృతిశెట్టిపై కనికరం చూపని కోలీవుడ్
వివరాలలోకెళితే.. అది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన రఫ్ అనే సినిమాను డైరెక్ట్ చేసిన CH సుబ్బారెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ‘ వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి కొద్దీ రోజుల క్రితం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఇప్పుడు ఆ చిన్న సినిమా నిర్మాతలు దర్శకుడు రాజమౌళిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసారు. దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘వారణాసి’ టైటిల్ ను వారి కంటే ముందు మేము రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పై రిజిస్టర్ చేపించామని అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఛాంబర్ నుండి ఇచ్చిన లెటర్ రిలీజ్ చేశారు. మేము రిజిస్టర్ చేసుకున్న టైటిల్ మా అనుమతి లేకుండా రాజమౌళి వాడుకున్నాడని రామ బ్రహ్మం క్రియేషన్స్ నిర్మాత విజయ్ కే ఆరోపించారు. మరోవైపు వారాణసి టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.ఇలా రాజమౌళి వరుస చిక్కుల్లో ఇరుకున్నారు.