ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం కృతి శెట్టి ఫస్ట్ త్రీ ఫిల్మ్స్ మంచి హిట్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమౌ తోంది. తెలుగులో సక్సెస్ రావడం లేదని మాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టి ఫస్ట్ ఎటంప్ట్ ఏఆర్ఎంతో బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇదే ఊపుతో ఈ ఏడాది కోలీవుడ్‌ను ఊపేద్దామనుకుంటే ఆమె నటించిన సినిమాలు డైలామాలో పడిపోతున్నాయి.
Also Read : GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు
కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ మరింత డిలే అయ్యేట్టుగానే కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం కార్తీ మూవీ వా వాతియార్‌కు కమిటైంది బేబమ్మ. ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ దొరుకుతుంది అనుకుంటే.. బొమ్మ షూటింగ్ వాయిదా పడుతోంది. కార్తీ 27న వచ్చిన మెయ్యజగన్ థియేటర్లలోకి వచ్చి ఏడాది కూడా పూర్తయ్యింది.. కానీ వా వాతియార్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది టీం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ కానీ సాంగ్స్ రిలీజ్ కాని చేయలేదు. దీంతో బొమ్మ మళ్లీ వాయిదా పడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వా వాతియార్ పరిస్థితి ఇలా ఉంటే.. లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ పరిస్థితి మరోలా ఉంది. డ్యూడ్ సినిమాతో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ డిసెంబర్ 18కి వాయిదా పడింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ కానీ.. ఇన్ఫర్మేషన్ కానీ పంచుకోవడం లేదు టీం. దీంతో ఈ బొమ్మలు డిసెంబర్ కు వస్తాయా రావా అన్న డౌట్ వ్యక్తం చేస్తున్నారు కోలీవుడ్ క్రిటిక్స్. ఈ రెండు బొమ్మలు వాయిదా పడితే మాత్రం కృతి శెట్టి ఈ ఏడాది బాక్సాఫీసును మిస్ చేసినట్లే. లిక్ వాయిదా పడితే ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కూడా మిస్ చేసుకున్నట్లే.