Odela 2: ‘ఓదెల 2’కు భారీ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఓదెల 2’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో కులం పేరుతో అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్‌కు బీసీ కమిషన్ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా, ఆయా సన్నివేశాలను తొలగించాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డుకు కమిషన్ సూచించింది. ఈ నెలలో విడుదలైన ‘ఓదెల 2’ సినిమాలో ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ 116 రూపాయలు కానుక రాయించిన విషయమై జరిగిన వాదప్రతివాదనలో పిచ్చగుంట్ల కులం పేరును అభ్యంతరకరంగా వాడినట్టు తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ పేర్కొంది. శుక్రవారం పిచ్చగుంట్ల కులానికి చెందిన పి. మల్లేష్ అనే వ్యక్తి బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపిన కమిషన్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలని కోరినట్టు వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇదివరకే అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.
Pakistan: భారత్‌కి వ్యతిరేకంగా పాక్ పార్లమెంట్‌లో తీర్మానం..
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఈ విషయమై సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తూ, వెంటనే దర్యాప్తు చేసి సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయిత, ఆ అభ్యంతరకర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ కోరింది. ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఈ అభ్యంతరకర పదాలు ఉన్న చిత్రానికి, ఆ పదాలు తొలగించకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ చిత్రంలో ఇకపై జరిగే ప్రదర్శనలలో ఈ అభ్యంతరకర పదాలను తక్షణం తొలగించాలని కమిషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ డీజీపీకి ఈ లేఖ కాపీని పంపిస్తూ, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. ఈ వ్యవహారంపై స్పందించిన సెన్సార్ బోర్డు అధికారి రాహుల్ గౌలీకర్, ఆ సన్నివేశంలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!