సీనియర్ అండ్ ఫేడవుట్ దశకు చేరుకుంటున్న కోలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేష్యో మెయిన్ టైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఊవిళ్లూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. డీసీ అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. లోకీ రౌడీ బాయ్ లా మారితే వామికా గబ్బీ వేశ్యపాత్రలో నటిస్తోంది .
Also Read : Bollywood : ఈ ఏడాది స్టార్ కిడ్స్‌కు కలిసి రాని సిల్వర్ స్క్రీన్..
టూరిస్ట్ ఫ్యామిలీతో ఓవర్ నైట్ అటెన్షన్ తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఒక్క సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్రాడు.. వెంటనే ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడా అనుకుంటే.. తానే హీరోగా అవతారం ఎత్తాడు. రజనీ కాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా మారి లవ్ స్టోరీని తెరకెక్కిస్తోంది. ఇందులో మాలీవుడ్ కుట్టీ అనేశ్వర రాజన్ హీరోయిన్. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నఈ ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇక స్టార్ అనే సినిమాతో మంచి అప్లాజ్ తెచ్చుకున్న దర్శకుడు ఎలాన్ కూడా హీరోగా ఛేంజయ్యాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్. ప్యాషన్ కోసం హీరోలుగా మారుతున్న ఈ డైరెక్టర్లు ఫిల్మ్ మేకర్లుగా పర్మినెంట్ అవతారా అంటే అదీ కాదు దర్శకులుగా ఛాన్సులు చేతిలో ఉన్నాయి. మరి నెక్ట్స్ యాక్టర్లుగా కంటిన్యూ అవుతారో లేక ధనుష్, సుందర్ సి, లారెన్స్ లా యాక్టర్లుగా, దర్శకులుగా డ్యూయల్ రోల్ పోషిస్తారో లెట్స్ సీ