Ananya Nagalla : అలాంటి సీన్స్ చేసే విషయంలో నా మనసు మార్చుకున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల తొలి సినిమాతోనే సహజ నటనతో చక్కగా ఆకట్టుకుంది. ‘మల్లేశం’ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఈ భామ కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటుంది.‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పినా, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలిపింది.. “తాను ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో పెద్ద కిస్ సీన్ ఉంటుంది. ఆ సినిమాకు అది ఎంత అవసరం.. అనేది ఆ సినిమా ట్రైలర్ లాంఛ్, లేదంటే ఆ మూవీ విడుదల అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కానీ, ఆ సందర్భంలో చాలా ముఖ్యం కాబట్టే చేశాను అని తెలిపింది..
‘తంత్ర’ సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. గ్లామర్, రొమాంటిక్ సీన్లు, సోషల్ మెసేజ్ మరియు హారర్ ఇలా అన్నీ ఉంటాయి. ఆయా సినిమాలకు అవసరమైన రీతిలో తప్పకుండా నటిస్తాను. 6 నెలలకు లేదంటే ఏడాదికి ఓసారి మనిషి మారుతూ ఉంటారు. అలా మారకపోతే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ‘మల్లేశం’ సినిమా సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త. ఎలా చేసినా కూడా మనకు రోల్స్ వస్తాయి అనుకున్నాను. అయితే, నటనలో రొమాంటిక్ సీన్లు కూడా సినిమాలో ఓ భాగం అని అర్థచేసుకోవడానికి నాకు కొంచెం టైమ్ పట్టింది” అని అనన్య చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అనన్య నాగళ్ల హీరోయిన్ గా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ ‘తంత్ర’ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?