Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండగా, తాజాగా మరో సంచలన కాంబినేషన్ తెరపైకి వచ్చి సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచిన ‘తుడరుమ్’ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక పవర్ఫుల్ కథను వినిపించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ వినిపించిన నేరేషన్, అందులోని బలమైన కంటెంట్ చిరంజీవిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. న్యాచురల్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్ కథకి మెగాస్టార్ బాగా కనెక్ట్ అయ్యారని సమాచారం. ప్రాథమికంగా కథా చర్చలు ముగిసినప్పటికీ, పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తయ్యాక దీనిపై మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యభరితమైన కంటెంట్ ఉన్న కథలకే చిరు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇతర భాషల్లోని ప్రతిభావంతులైన యువ దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేయడంలో, వారికి అవకాశాలు కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే ‘తుడరుమ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా నిరూపించుకున్న సదరు దర్శకుడు, చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా మాస్ అంశాలతో పాటు కథా బలం ఉన్న ఒక సరికొత్త సబ్జెక్ట్‌ను డిజైన్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. కథ లైన్ బాగా నచ్చడంతో మెగాస్టార్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతే నిర్మాత ఎవరు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఒక స్పష్టత రానుంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే, తెలుగు తెరపై కంటెంట్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన మరో అదిరిపోయే ప్రయోగం చూడొచ్చని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
- Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
- CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
- Prabhas: బాకీ తీర్చుకోనున్న 'డార్లింగ్' ప్రభాస్!
తాజావార్తలు
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
-
Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
-
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!