తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన సమ్మె కారణంగా టాలీవుడ్ షూటింగ్స్ పూర్తిగా స్తంభించాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఫెడరేషన్ యూనియన్లతో సంప్రదింపులు నిషేధించింది. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై, సమ్మె కొనసాగింపుపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో…