Chiranjeevi Birthday: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేడు తన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గోవాలో కేక్ కట్ చేయించారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబంతో కలిసి జరుపుకున్న ఈ వేడుకలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ స్పెషల్ మూమెంట్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో చిరంజీవి రామ్‌చరణ్‌కు మొదట కేక్ తినిపిస్తారు. వెంటనే రామ్‌చరణ్ తన తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన కూడా తన తండ్రికి కేక్ తినిపిస్తాడు. ఈ తండ్రి-కొడుకుల మమకారం చూసి మెగా అభిమానులు తండ్రికొడుకలంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
WhatsApp Update: వాట్సప్ మిస్ కాల్స్‌కి సాల్యూషన్.. కొత్త వాయిస్ మెసేజ్ షార్ట్‌కట్
ఇక ఈ వీడియోతో పాటు రామ్‌చరణ్ ఒక భావోద్వేగపూర్వక సందేశం రాశాడు.. అందులో ఈ రోజు కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్నా, మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. నా హీరో, నా మార్గదర్శకుడు, నా ప్రేరణ మీరు. నేను సాధించిన ప్రతి విజయం, నేను పాటించే ప్రతి విలువ అన్ని మీ వద్ద నుంచే నేర్చుకున్నవి అంటూ రాసుకొచ్చారు. 70 ఏళ్ల వయసులోనూ మీరు హృదయంలో మరింత యవ్వనంగా మారుతూ, అందరికి ఆదర్శనంగా నిలుస్తున్నారని.. మీ ఆరోగ్యం, ఆనందం, రాబోయే అనేక అద్భుతమైన సంవత్సరాలు కలగాలని ప్రార్థిస్తున్నానని.. అలాగే ప్రతి ఒక్కరూ కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ ‘హ్యాపీ బర్త్‌డే ❤️’ అని ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను గమనించినట్లయితే రామ్ చరణ్ మరోసారి స్వామి మాల వేసుకునట్లుగా తెలుస్తోంది.
YouTube Music: 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ‘యూట్యూబ్ మ్యూజిక్’.. కొత్త ఫీచర్స్ ఇవే!