బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఛావా.
మొదటి రోజు రూ.50 కోట్లతో స్టార్ట్ అయిన ఛావా వరల్డ్ వైడ్ గా రూ. 550 కోట్లు మార్క్ దాటి పయనిస్తుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఛావా ను అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. తెలుగులో ఛావా ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఛావా నార్త్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకోగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఏ మేరకుమెప్పిస్తోందో చూడాలి. కాగా ఈ సినిమాతో రష్మిక మందన్న నార్త్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కొట్టేసింది.