ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు క్యూ కడుతున్నారు. కానీ ప్రభాస్ ఏదైనా కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయాలంటే అంతకన్నా ముందు ఆయన ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇక అసలు విషయానికొస్తే… ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి, ప్రభాస్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారీ రేంజ్ లో ప్రభాస్ కు సరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట యేలేటి. ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేశాక ప్రభాస్‌ను కలుస్తాడట. ఒకవేళ ప్రభాస్ గనుక తన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయితే… ప్రస్తుతం ప్రభాస్ చేయాల్సిన సినిమాలు అన్నీ పూర్తయ్యే వరకు వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నాడట యేలేటి. కాగా ప్రభాస్ త్వరలో ఆదిపురుష్, సాలార్ చిత్రాల షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఆ తరువాత నాగ్ అశ్విన్, సిద్ధార్థ్ ఆనంద్ లతో కలిసి పని చేయనున్నారు.