New Celeb Trend : పెళ్లయ్యాక విడాకుల కంటే ముందే విడిపోవడమే బెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో ఇది అసాధ్యంగా మారుతోంది. పెళ్లి బంధం ఒకటి, రెండేళ్ల పంటగా మారిపోతున్న సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు పెళ్లి సంగతి తర్వాత… నిశ్చితార్థం అయిన నెలలకే బ్రేకప్‌లు చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. నిశ్చితార్థం జరిగి, పెళ్లికి ముందే విడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కొందరు సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తుంటే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుంటూ, పాత జ్ఞాపకాలను డిలీట్ చేస్తూ అభిమానులకు హింట్‌లు ఇస్తున్నారు.
Also Read:Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
Also Read
- Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్'తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
- Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
- Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్‌తో పరిచయం.. 'ఆది' మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Rao Bahadur Teaser: లాస్ట్‌లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
ఈ జాబితాలో తాజాగా చేరింది నటి నివేదా పేతురాజ్. ‘బ్రోచేవారెవరురా’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మేన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే, ఇటీవలే వారిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ముఖ్యంగా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో… ఈ జంట కూడా నిశ్చితార్థం రద్దు చేసుకుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చెప్పుకున్న సెలబ్రిటీల జాబితా ఇది:
మెహ్రీన్ పిర్జాదా: ‘భవ్య బిష్ణోయ్’తో నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.
రష్మిక మందన: తన తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడిన రష్మిక, అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, కొంతకాలానికే వారి బంధం బ్రేకప్‌తో ముగిసింది.
త్రిష కృష్ణన్: అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న త్రిష… చెన్నైకి చెందిన బిజినెస్‌మేన్ వరుణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, వ్యక్తిగత భేదాభిప్రాయాల (డిఫరెన్సెస్) కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అఖిల్ అక్కినేని: అక్కినేని యువ హీరో అఖిల్, ప్రముఖ బిజినెస్‌మేన్ కూతురు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, చివరి నిమిషంలో ఈ నిశ్చితార్థం రద్దయ్యి, ఆ బంధం బ్రేకప్‌గా మిగిలింది. ఆ తర్వాత అఖిల్, బిజినెస్‌మేన్ కూతురు జైనాబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read:Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌తో మారిన సినిమాల ఫైనల్ రిలీజ్ డేట్‌లివే!
సినిమా సెలబ్రిటీల బ్రేకప్‌లు చూస్తుంటే, నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య ఉన్న గ్యాప్ ముఖ్య కారణంగా కనిపిస్తోంది. అయితే, ఈ గ్యాప్ రావడమే మంచిది అని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనస్పర్థలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. పెళ్లి తర్వాత డిఫరెన్సెస్ వచ్చి విడాకులతో సపరేట్ కావడం కంటే, ముందే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం, పెళ్లి కాకుండానే విడిపోవడం మంచిదని, ఇదే ఉత్తమమైన మార్గమని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO సభ్యులకు కీలక అప్డేట్.. వడ్డీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందంటే..?
-
Hyderabad: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రీకూతురు మృతి.!
-
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!