‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఆచరణలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో ఇది అసాధ్యంగా మారుతోంది. పెళ్లి బంధం ఒకటి, రెండేళ్ల పంటగా మారిపోతున్న సందర్భాలు అనేకం. అయితే, ఇప్పుడు పెళ్లి సంగతి తర్వాత… నిశ్చితార్థం అయిన నెలలకే బ్రేకప్‌లు చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. నిశ్చితార్థం జరిగి, పెళ్లికి ముందే విడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. కొందరు సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తుంటే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు…