CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBFC: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన నూతన పాలకమండలిని కేంద్రం అధికారికంగా నియమించింది. ఈ కమిటీ రాబోయే మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.
పాలకమండలిలో తెలుగు నుంచి సుప్రియకు కీలక బాధ్యత
ఈ నూతన కమిటీలో సినిమా, సంగీత రంగాలకు చెందిన అగ్రశ్రేణి దిగ్గజాలకు కేంద్రం పెద్దపీట వేసింది. బాలీవుడ్ స్టార్స్ ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టితో పాటు బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీ, సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ నూతన సభ్యులుగా ఎంపికయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కొత్త పాలకమండలిలో స్థానం దక్కింది. గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్, ప్రముఖ నటి రూపాలీ గంగూలీ, సీనియర్ నటుడు మనోజ్ జోషి, సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, అభిషేక్ జైన్, వినోద్ అనుపమ్, యతీంద్ర మిశ్రాలకు కూడా ఈ బోర్డులో స్థానం కల్పించారు.
Also Read
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
పాత కమిటీకి ఉద్వాసన..
గత కమిటీలోని సభ్యుల్లో అత్యధికులను తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అలనాటి తార గౌతమి, జీవితా రాజశేఖర్, ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి విద్యా బాలన్, మాజీ ఫుట్‌బాల్ స్టార్ భైచుంగ్ భూటియాల పదవీకాలం ముగియడంతో వారికి ఉద్వాసన పలికారు. కేవలం రంగస్థల దర్శకుడు వామన్ కేంద్రే, ప్రముఖ రచయిత రమేశ్ పతంగేలకు మాత్రమే తిరిగి ఈ కమిటీలో కొనసాగే అవకాశం లభించింది. కంటెంట్ సర్టిఫికేషన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సినిమాటిక్ సెన్సార్షిప్ వివాదాలు నిత్యం రగులుతున్న ప్రస్తుత తరుణంలో, వివిధ భాషలకు చెందిన స్టార్స్, మేకర్స్, మ్యూజిక్ లెజెండ్స్‌తో సరికొత్తగా కొలువుదీరిన ఈ నూతన CBFC బోర్డు భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!