ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “అల వైకుంఠపురములో” చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం విజయవంతం కావడానికి మ్యూజిక్ ముఖ్యకారణం అని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘సామజవరగమనా సాంగ్, బుట్టబొమ్మ, రాములో రాములా, ఓహ్ మై గాడ్ డాడీ, సిత్తరాలా సిరపడు… ఇలా ఆల్బమ్‌లోని ప్రతి సాంగ్ కు అద్భుతమైన స్పందన…