Tollywood: మన దర్శకులకు ఏమైంది?

Tollywood

Tollywood

తమిళ్ డైరెక్టర్లు చేసే సినిమాల్లో ఉన్న ఇంటెన్సిటీ మన సినిమాలో కనిపించడం లేదా? నిజానికి ఈ సంవత్సరం తమిళంలో వచ్చిన చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా సూర్య మూడు సినిమాలతో సక్సెస్ లను సాధించాడు. లోకేష్ కనకరాజ్ సైతం ‘డిసి’ మూవీ తో తెలుగు లో చాలా మంది హీరోలకు సాధ్యంకాని రికార్డు ను నమోదు చేశాడు. మొదటి సినిమాతోనే నటుడిగా 100 కోట్లు కొల్లగొట్టాడు. మన ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోలు ఎంత ప్రయత్నించిన 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేయలేకపోతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటె ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. అందుకే తెలుగు దర్శకులు సైతం కథల మీద శ్రద్ధ పెడితే బాగుంటుందని సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయారు. కంటెంట్ లో లోపం వల్లనే ప్లాప్ లు వచ్చాయి. నిజానికి తెలుగు దర్శకుల మీద అందరికి నమ్మకం పెరుగుతున్న సమయం లో ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఇలాంటి సినిమాలను తీయడం అందరిని నిరుత్సాహపరిచింది. మన డైరెక్టర్స్ తలుచుకుంటే వండర్స్ ను క్రియేట్ చేయగలరు కానీ ఎక్కడో లెక్క తప్పుతుంది. అధిక రక్తపాతం ఉంటేనే సినిమా అనుకుంటున్నారు. కానీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకే ఎమోషన్ తో కథ రాసుకొని దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే చాలు ఈజీగా సక్సెస్ ను సాధించవచ్చు…

ఇప్పటికైనా ఇక మీదట చేసే సినిమాల విషయంలో దర్శకులు స్పెషల్ కేర్ తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఏ ఒక్క జానర్ కి ఫిక్స్ అవ్వకుండా జానర్స్ ను షిఫ్ట్ చేస్తూ సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తే బాగుంటుంది. రాజమౌళి లాంటి దర్శకుడు భారీ బడ్జెట్ తో విజువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి మిగతా దర్శకులు చేసే సినిమాలను వీలైనంత తొందరగా చేసి సక్సెస్ లను సాధిస్తే ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ నిలబడే అవకాశం ఉంటుంది.