హీరో ఎలివేషన్లకు, ఊర మాస్ ఫైట్లకు, హారర్ కామెడీలతో విసుగుపోయిన బాలీవుడ్ జనాలకు హార్ట్ టచ్చింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఫిల్మ్ సైయారా. పెద్ద హైప్ అండ్ హోప్ లేకుండా జులై 18న థియేటర్లలోకి వచ్చి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యేలా కాసుల సునామి సృష్టిస్తోంది. సినిమా వచ్చి ఇరవై రోజులైనా గల్లాపెట్టి నింపుతూ నిర్మాతలకు ఊహించనంత పర్సెంటైజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్…