సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్‌లతో బీటౌన్‌లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది.
Also Read : KA 11 : ‘కిరణ్ అబ్బవరం ‘KRAMP’ ఫస్ట్ లుక్ రిలీజ్
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్‌కు సికందర్ బ్రేకులేసింది కానీ కుబేర ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు శ్రీవల్లి రూట్ మార్చింది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్క అంటోంది. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో వచ్చేస్తోంది మేడమ్. ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్, మైసాతో పాటు బాలీవుడ్‌లో థామా, మరో ప్రాజెక్టుకు కమిటైనట్లు తెలుస్తోంది. సామ్, రష్మిక లైనప్ ఓకే కానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియెంట్ చిత్రాల ఎంత వరకు వచ్చాయో క్లారిటీ లేదు. సామ్ నిర్మాతగా మారే క్రమంలో ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ‘మా ఇంటి బంగారం’ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంత వరకు వచ్చిందో ఇప్పటికి కనీసం అప్డేట్ లేదు. శుభం ప్రమోషన్లలో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. అలాగే రష్మిక రెండేళ్ల క్రితం రెయిన్ బో అనే చిత్రానికి కమిటయ్యింది. శాకుంతలం ఫేం దేవ్ మోహన్ హీరోగా ఫిక్సైన ఈ మూవీ కూడా అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. కానీ ఆ వెంచర్ సెట్స్‌పైకి వెళ్లిందో లేదో కూడా తెలియదు. ఇలా ఇద్దరి స్టార్ హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమయ్యాయో క్లారిటీ లేకుండా ఉంది.