యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘నయనం’. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక జైన్, ఉత్తేజ్, అలీ రెజా, రేఖా నిరోషా, హరీష్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, డ్రామా అంశాలు ప్రధానంగా ఉన్న ఈ సిరీస్.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో, సిరీస్‌కు మరింత బజ్ తీసుకురావడం కోసం ప్రమోషన్ కార్యక్రమాలు మేకర్స్ వేగవంతం చేశారు.
Also Read : Toxic : కౌంట్‌డౌన్ మొదలు పెట్టిన గ్యాంగ్‌స్టర్ ‘టాక్సిక్’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ప్రచారంలో భాగంగానే, తాజాగా ‘నయనం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా కథాంశం పై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా, ‘కళ్ల డాక్టర్ దగ్గర కళ్లకు కనిపించని సీక్రెట్స్ చాలానే ఉన్నాయి’ అనే డైలాగ్.. సిరీస్ మొత్తం ఓ డాక్టర్ చుట్టూ తిరిగే రహస్యాలు, థ్రిల్లింగ్ అంశాలతో నిండి ఉంటుందని స్పష్టం చేసింది. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్‌గా సాగింది. మొత్తానికి, ‘నయనం’ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్రేక్షకులకు మంచి సస్పెన్స్ థ్రిల్‌ను అందిస్తుందా చూడాలి.