“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు తాజాగా సోషల్ మీడియా ద్వారా ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుష్క శర్మ, అలియా భట్, టైగర్ ష్రాఫ్, దిషా పటాని, మలైకా అరోరా తదితరులు సోషల్ మీడియాలో ఈ సంఘటనపై స్పందిస్తూ జంతు హింసపై కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read also : ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో గ్లోబల్ బ్యూటీ… సంపాదన చూస్తే షాక్…!!
ఒక పెంపుడు కుక్కను దారుణంగా హింసించిన ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. నిందితులు తిరువనంతపురానికి చెందిన మైనర్లు. వీరిని జూలై 1 న విజిన్జమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వైరల్ అవుతున్న వీడియోలో కుక్కను పడవలో ఫిషింగ్ హుక్‌తో కట్టి, దానిని కర్రతో కొట్టి కొట్టి హింసించి మరీ చంపారు. ఆ అది చనిపోయేంత వరకు దానిని కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. తరువాత ఆ మూగ జీవాన్ని సముద్రంలోకి విసిరేశారు. కొంతమంది మనుషుల్లోని ఈ క్రూరమైన లక్షణాలు కలవరపెడుతున్నాయి.