“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన…