ఓ నెలలో ఓ స్టార్ హీరో మూవీ వస్తుంటే ఆ సినిమాకే మూవీ లవర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం కామన్. కానీ టాప్ హీరోలంతా కట్టగట్టుకుని వస్తే ఆడియన్స్ పరిస్థితి ఏంటంటారు. అదే జరుగుతోంది శాండిల్ వుడ్‌లో. ఒక్కరు కాదు ఇద్దరు కాదు కన్నడ టైర్1 హీరోలంతా డిసెంబర్ మంత్‌పై దాడి చేస్తున్నారు. అందరి కన్నా ముందుగా వస్తున్నాడు డీ బాస్ దర్శన్. రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఈ నటుడు మధ్యలో బెయిల్‌పై వచ్చి కంప్లీట్ చేసిన ద డెవిల్ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఛాలెంజింగ్ స్టార్ ఈ కేసులో ఇరుక్కునా కూడా ఫ్యాన్స్‌కు దర్శన్‌పై ఏ మాత్రం అభిమానం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్సాన్స్‌ను బట్టే అర్థమౌతోంది.
Also Read : Kollywood : అమీర్ ఖాన్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోలేదండోయ్
క్రిస్మస్, ఇయర్ ఎండింగ్ మాదే అంటున్నారు మరో నలుగురు హీరోలు. శాండిల్ వుడ్ స్టార్ హీరోస్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఫిల్మ్ 45. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతూ డిసెంబర్ 25న రిలీజౌతోంది. ఈ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పాన్ ఇండియన్ సినిమాను అన్ని భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ ముగ్గురు స్టార్లతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మరో శాండిల్ వుడ్ టాప్ హీరో సుదీప్. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఉపేంద్ర యుఐపై సుదీప్ మాక్స్‌తో క్లియర్ డామినేషన్ చూపించాడు. ఇప్పుడు మల్టీ స్టారర్ ఫిల్మ్ 45తో తన మార్క్ మూవీతో తలపడబోతున్నాడు కిచ్చా సుదీప్. ఇలా నలుగురు స్టార్ హీరోలు తమ సినిమాలను డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తున్నారు.