2017లో ప్రారంభమైన తమిళ బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి 2023 వరకు 7 సీజన్స్ కు హోస్ట్‌గా వ్యవహరించారు కమల్ హాసన్. అయితే బిగ్ బాస్ సీజన్ – 8కు తాను హోస్ట్‌గా చేయలేనని ఇటీవల ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు కమల్. దాంతో ఈసారి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గామారింది. ఈ నేపథ్యంలో శింబు, నయనతారతో పాటు పలువురి స్టార్ల పేర్లు వినిపించాయి. కానీ అవేవి నిజం కాలేదు.
Also Read: Nani : తెలుగు ఇండియన్ ఐడల్ – 3లో సాంగ్ రిలీజ్ చేసిన నాని..
తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం మరి కొద్దీ రోజుల్లో స్టార్ట్ కానున్న తమిళ బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్ దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి సీజన్ 8కు హోస్ట్ భాద్యతలు అప్పగించబోతున్నారు నిర్వాహకులు. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఆల్మోస్ట్ ముగిసినట్టే. ఇటీవల మహారాజ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. ఈ ఉత్సహంతో బిగ్ బాస్ స్టేజ్ ను హోస్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ గత సీజన్స్ కు హోస్ట్ గా చేసిన కమల్ హాసన్ తన స్థానంలో కుర్ర హీరో శింబును రిఫర్ చేసినట్టు టాక్ నడుస్తోంది. కానీ శింబు వరుస సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం సెట్స్ పై సినిమాలు పూర్తి అయ్యేసరికి ఏడాది పడుతుందని, డేట్స్ క్లాష్ అవుతుందని భావించి సేతుపతి వైపు మొగ్గు చూపింది సదరు యాజమాన్యం. మరి తొలిసారి హోస్ట్ గా వ్యవహరించ బోతున్న మక్కల్ సెల్వన్ ఏ మేరేకు సక్సెస్ అవుతాడో ముందుముందు రోజుల్లో తెలుస్తుంది. .