బాలీవుడ్ స్థార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘బెల్ బాటమ్’. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే “బెల్ బాటమ్”, హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ “ఎఫ్9” బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఇప్పటికే చాలా నష్టపోయారు. చాలా నెలలుగా మూసివేయబడిన సినిమాస్ ను ఇప్పుడు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరవడానికి అనుమతి లభించింది.
Read Also : ‘బెల్ బాటమ్’ స్టార్ బ్లాక్ టికెట్ కథ!
ఈ నేపథ్యంలో థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు ఇప్పటికే తగ్గిపోయారు. దీని కారణంగా థియేటర్ యజమానులకు మునుపటి కంటే తక్కువ లాభం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పంపిణీదారులు ఒకే తేదీన రెండు పెద్ద చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. “బెల్ బాటమ్” ఆగష్టు 19న విడుదల కానుంది. కాబట్టి దానికి కనీసం రెండు వారాల గ్యాప్ తర్వాత విన్ డీజిల్ “ఎఫ్ 9″ను విడుదల చేయవచ్చు అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ప్రస్తుతం దీని గురించి చర్చిస్తున్నారు. అయితే వారు నష్టాలను చవిచూడడానికి మాత్రం సిద్ధంగా లేరు. అందుకే “ఎఫ్9” విడుదల తేదీని మరికొంత పొడిగించవచ్చు.