వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. కోవిడ్ లాంటి పరిస్థితిలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా కోసం సిద్దంగా ఉన్నారు. ఇక బండ్ల గణేష్ ఓ సినిమాను పవన్ కళ్యాణ్‌తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. అయితే బండ్ల గణేష్ నిర్మించే సినిమాలో దర్శకుడు రమేష్ వర్మ ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై తాజాగా బండ్ల గణేష్ స్పందించాడు. ‘దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి. పవన్ తో సినిమా ఖాయం అయ్యాక నేనే స్వయంగా తెలియజేస్తాను. అప్పటివారికి ఇలాంటి వార్తలను నమ్మకండి’ అంటూ బండ్ల గణేష్ తెలిపారు.