టాలీవుడ్ యంగ్ దర్శకుడు బాబీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ దర్శకుడిగా మారుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ ను డైరెక్ట్ చేసిన బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా బాబీ గత సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు అనే పేరు తెచుకున్నాడు. అటు చిరుకు వాల్తేర్ వీరయ్య, ఇటు బాలయ్యకు డాకు మహారాజ్ తో సీనియర్ హీరోలను బాబీ బాగా హ్యాండిల్ చేయగలడు అని నిరూపించాడు.
Also Read : James Cameron : అవతార్ – 3 ఫస్ట్ లుక్ రిలీజ్.. ట్రైలర్ డేట్ ఇదే
డాకు మహారాజ్ వచ్చి దాదాపు ఆరు నెలలు దాటుతోంది. మరి బాబీ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై క్లారిటి రాలేదు. చిరుతో మరో సినిమా చేయబోతున్నాడు అని ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ చిరు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్యతో కూడా మరో సినిమా చేయబోతున్నాడని కూడా టాక్ కూడా ఉంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోతున్న సినిమా తర్వాత బాబీ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పడు మరొక న్యూస్ టాలీవుడ్ లో హాల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం దర్శకుడు ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ హై యాక్షన్ గా ఉండబోతుందట. డాకు మహారాజ్ లోని యాక్షన్ ఎపిసోడ్స్ కు విశేషమైన ఆదరణ లభించింది. ఇప్పడు అంతే స్థాయి హై యాక్షన్ తో పవర్ఫుల్ స్టోరీ రాస్తున్నాడట బాబీ. గతంలో వీరి కంబోలో వచ్చిన జై లవ కుశ సూపర్ హిట్ గా నిలిచింది. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన బాబీతో సినిమాను ఎప్పుడు చేస్తాడనేది ఇప్పుడు చర్చ.