సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య, యువి నక్షత్రలతో వచ్చారు. అక్కడికి బాలకృష్ణ కూడా హాజరవడంతో, చిన్నారులు ఆనందంతో బాలయ్య దగ్గరికి వెళ్లగా బాలయ్య మోకాళ్లపై కూర్చుని మరీ ఫోటోలు దిగారు.
Also Read :Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..
ఈ మధురమైన దృశ్యాలు వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయభాను బాలకృష్ణకి పెద్ద అభిమాని. ఆయనను తన అన్నలా గౌరవిస్తారు. గతంలో ఆమె పలు సందర్భాల్లో చెప్పినట్లు, కష్టకాలంలో బాలయ్య ఆమెకు సహాయంగా నిలిచారు. అంతేకాకుండా, తన కూతుళ్ల మొదటి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించారు. పిల్లల పట్ల ఆయన చూపే ప్రేమ అపారమని ఉదయభాను ఎప్పుడూ చెబుతుంటారు. ఈ తాజా వీడియోను ఉదయభాను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో, బాలయ్య అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.